ఫ్రీ కదా అని వాడుతున్నారా?

     Written by : smtv Desk | Thu, Jul 20, 2017, 11:57 AM

ఫ్రీ కదా అని వాడుతున్నారా?

మనం సాధారణంగా ఎయిర్‌పోర్ట్‌, బస్టాండ్, రైల్వేస్టేషన్ ఇలా ఎక్కడికి వెళ్ళిన ఫ్రీ వైఫై కోసం వెతుకుతాం. అక్కడ అడిగే వివరాలను ఇచ్చి లాగిన్ అవుతుంటాం. కానీ ఇలాంటి పబ్లిక్‌ వైఫైలతో చాలా సమస్యలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుందని తెలిసి కూడా చాలామంది అదే పని చేస్తుంటారు. ఇలాంటి పబ్లిక్ ప్లేస్ లో వైఫై వాడడం వల్ల మీ వ్యక్తిగత సమాచారం అంతా ఇతరులకు చేరే ప్రమాదం ఉంది.

ఎంత రిస్క్ అయిన ఉచితంగా వస్తే భరించేందుకు సిద్దమే అనే వినియోగదారులు ఎక్కువే ఉన్నారంటా. చిత్రం ఏంటంటే... చాలామందికి సైబర్‌ సెక్యూరిటీ గురించి.. దాంతో వచ్చే సమస్యల గురించి తెలియకపోవడం. ఇటీవల "సైబర్‌ సెక్యూరిటీ సంస్థ" నార్టన్‌ పబ్లిక్‌ వైఫై వాడకంపై 15 దేశాల్లో విస్తృత సర్వే చేపట్టగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ సర్వే వివరాలిలా ఉన్నాయి... సోషల్‌ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఎడిట్‌ చేసే వారు 19%, పబ్లిక్‌ వైఫై ద్వారా బ్యాంక్‌ అకౌంట్లు చూసుకుంటూ, ఫొటోలు షేర్‌ చేసే వారు 96%, పబ్లిక్‌ వైఫై వల్ల తమ వివరాలకు వచ్చిన నష్టమేమీ లేదనుకునే భారతీయులు 74%, కొత్త చోటికి వెళితే వైఫై లోకి ప్రవేశించేందుకు ఆలస్యం చేయని వారు 51%, వ్యక్తిగత ఈ-మెయిల్, కాంటాక్ట్స్‌ వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వారు 19%, వైఫై తో పోలిస్తే సురక్షితమైన వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌(వీపీఎన్‌)ను వాడే వారు 48%, పబ్లిక్‌ వైఫై తో అసభ్య చిత్రాలు, వీడియోలు చూసే వారు 31% గా ఉన్నారు.

అందుకే జాగ్రత్త పడండి ముందుగా ఆన్‌లైన్‌ సెక్యూరిటీ కోసం వెబ్‌సైట్ల యూఆర్‌ఎల్‌లలో హెచ్‌టీటీపీఎస్‌ ప్రోటోకాల్‌‌ ఉందో.. లేదో.. చూసుకోవాలి. అయినా నెట్‌వర్క్‌ సురక్షితంగా లేకపోతే హెచ్‌టీటీపీఎస్‌ ఉన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు అపరిచితుల చేతుల్లో పడితే కష్టాలు తప్పవని నార్టన్‌ సర్వే హెచ్చరిస్తోంది. సైమాంటిక్‌ అభివృద్ధి చేసిన వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ‘నార్టన్‌ వైఫై ప్రైవసీ’ వంటివి వాడడం వల్ల సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. ఆటోమేటిక్‌గా కనెక్టయ్యే వైఫై నెట్‌వర్క్‌ ను వాడకపోవడమే మేలు.





Untitled Document
Advertisements