స్లిప్పర్లు వాడుతున్నారా..!

     Written by : smtv Desk | Thu, Jul 20, 2017, 12:56 PM

స్లిప్పర్లు వాడుతున్నారా..!

హైదరాబాద్, జూలై 20: చాలామంది ఇంట్లో, బయట, తిరగడం కోసం మాములుగా స్లిప్పర్స్ నే వాడుతుంటారు. తొందరగా వేసుకొని విడవడానికి వీలుగా ఉంటుందని తరచూ అవే వినియోగిస్తుంటారు. ఇక కొన్ని దేశాల్లోని పేద వర్గాలకు చెందిన వారు నిత్యం స్లిపర్లనే ఉపయోగిస్తారు.

కాని అలా చేయడం సరికాదని హెచ్చరిస్తున్నారు నార్త్ కరోలినాలోని వేక్ ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ కు చెందిన ప్రముఖ నిపుణులు పోడియాట్రిస్ట్(పాదాల నిపుణులు), ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ డాక్టర్ క్రిస్టియానా లాంగ్.

స్లిపర్స్ కేవలం కొద్దిసేపు ఇంట్లో వాడుకోవడానికే వాడాలి కాని దీర్ఘకాలం పాటు వాడే వారిలో అవి టపటపమంటూ అదే పనిగా మడమకు తగులుతూ ఉండడం వల్ల మడమ ఎముక దెబ్బ తినడంతో పాటు "అచిలిస్ టెండన్" అనే సమస్య వస్తుంది.

దీంతో నడుము నొప్పి వంటి అనర్థాలు కనిపించవచ్చని చెబుతున్నారు డాక్టర్ క్రిస్టియానా. "పైగా స్లిప్పర్లు, పాదంలో ఒంపు తిరిగి ఉండే చోట తగిన సపోర్ట్ ఇవ్వవు దీనివల్ల కూడా అనేక సమస్యలు వస్తాయి అందువల్ల వీటిని కొద్ది సమయమే వాడాలి కాని అదే పనిగా వాడకూడదు" అని ఆమె వివరిస్తున్నారు.

Untitled Document
Advertisements