ఆరోగ్యానికి ఇవి పాటించండి..!!

     Written by : smtv Desk | Wed, Aug 23, 2017, 05:03 PM

ఆరోగ్యానికి ఇవి పాటించండి..!!

హైదరాబాద్,ఆగస్ట్ 23: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు..రోజుకి ఎనిమిది గంటలకు పైగా పనిచేసే మహిళలు వారి ఆరోగ్యం పై చాలా శ్రద్ధ తీసుకోవాలి, అలాగని బాగా కష్టపడి వ్యాయామాలు చేయాలని కాదండోయ్..!! కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటిస్తే చాలు. అవి ఇవేనండి..

* రోజు అరగంటకి పైగా నడిచిన కూడా అవకాశం ఉన్నప్పుడల్లా నడవడం మంచిది. తరచు లిఫ్టు లు కాకుండా అవకాశం ఉన్నపుడల్లా మెట్లేక్కడం శరీరానికి మంచిది.

* ఆడవాళ్లకు నిమిషానికి 75 ను౦చి 85 సార్లు గుండె కొట్టుకోవాలి. ఇది సవ్యంగా ఉండాలంటే...తగిన చిట్కాలు పాటించాలి అవి ఇవే, యోగా, డంబెల్స్ తో వ్యాయామం చేయడం మంచిది. ఈ తరహా వ్యాయామాలు గుండె రక్తనాళాల్లో రక్తం సవ్యంగా సరఫరా అవుతుంది.

* రోజంతా కంప్యూటర్లపై పనిచేసేవారి వేళ్లు ఎకువగా అలసిపోతాయి. వెళ్లు నొప్పులు రావద్ద౦టే, జుట్టుకు పెట్టుకునే రబ్బరుబ్యాండ్ తో చేతి అయిదువేళ్లను దగ్గరకు చేర్చి రబ్బరుబ్యాండ్ ను వేసి బ్యాండ్ ను దగ్గరగా, దూరంగా చేస్తే మంచిది.

* నడుమునొప్పి రాకుండా ఉండాలంటే...నిల్చున్న, కూర్చున్న నిటారుగా ఉండేలా చూసుకోవాలి.

* ఎన్ని వ్యాయామాలు చేసిన ఉదయం అల్పాహారాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇందులో పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకుంటే రోజుంతా ఉత్సాహంగా ఉండొచ్చు. రోజుకి రెండు లీటర్ల నీరు త్రాగడం మంచిది.

Untitled Document
Advertisements