కరీబియన్ దీవులకు మళ్లీ ముప్పు..!

     Written by : smtv Desk | Tue, Sep 19, 2017, 03:10 PM

కరీబియన్ దీవులకు మళ్లీ ముప్పు..!

కరీబియన్‌, సెప్టెంబర్ 19 : ఇర్మా ధాటికి అతలాకుతలం అయిన కరీబియన్ దీవుల పై మరో హరికేన్ విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది. మరో రెండు రోజుల్లో హరికేన్ మారియా మరింత బలపడుతుందని అమెరికా జాతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. అది లీవార్డ్‌ ద్వీపాల మీదుగా ప్రయాణిస్తుందని వివరించింది. ప్రస్తుతం కేటగిరి-2 హరికేన్ గా బలపడిన మారియా గంటకు 21 కి.మీ వేగంతో తూర్పు కరీబియన్ మీదుగా వెళ్తుందని తెలిపింది.

దీని కారణంగా గంటకు సుమారు 175 కి.మీ వేగంతో గాలులు విస్తాయని హెచ్చరించింది. త్వరలో హరికేన్ మారియా 3 లేదా 4 కేటగిరిగా వృద్ధి చెంది మరింత కరీబియన్ దీవులకు మరో భారీ నష్టం చేకూరే అవకాశం ఉందని వెల్లడించింది. డొమినికా, మార్టినిక్‌, పోర్టారికో, గ్వాడలీప్, సెయింట్ కీట్స్, నేవీస్, ద్వీపాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Untitled Document
Advertisements