సైకిల్ పై ప్రపంచాన్ని చుట్టివచ్చిన ఘనుడు

     Written by : smtv Desk | Wed, Sep 20, 2017, 02:33 PM

సైకిల్ పై ప్రపంచాన్ని చుట్టివచ్చిన ఘనుడు

పారిస్, సెప్టెంబర్ 20 : సైకిల్ పై ప్రపంచాన్నే చుట్టేసిన ఓ బ్రిటీషు క్రీడాకారుడు రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నారు. గతంలో ఓ వ్యక్తి 123 రోజుల్లో సైకిల్ పై భూగోళాన్ని చుట్టి రికార్డు సృష్టించగా, మార్క్ బ్యూమౌంట్(44) 79 రోజుల్లోనే ఆ ఘనత సాధించడం విశేషం. జూలై 2న పారిస్ లో తన ప్రయాణం ప్రారంభించిన మార్క్, ఐరోపా దేశాలు, రష్యా, మంగోలియా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉత్తర అమెరికా మీదుగా సైకిల్ పై పర్యటిస్తూ సోమవారం తిరిగి పారిస్ చేరుకున్నారు.

ఈ సాహసంలో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డా.. తిరిగి కోలుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఈ పర్యటనలో మార్క్ బ్యూమౌంట్ రోజుకు సగటున 386 కిలోమీటర్ల చొప్పున సైకిల్ తొక్కుతూ తన ప్రయాణాన్ని కొనసాగించారు. కేవలం 79 రోజుల్లోనే ప్రపంచాన్ని చుట్టి వచ్చినందుకు రికార్డును సొంతం చేసుకోవడమే కాక దానికి తోడూ ఒకే నెలలో అత్యధిక కిలోమీటర్ల సైకిల్ తోక్కినందుకుగాను గిన్నిస్ ప్రపంచ రికార్డ్స్ అధికారులు అభినందిస్తూ మార్క్ కు మరో టైటిల్ అందజేశారు.

Untitled Document
Advertisements