ధోనీకి ప‌ద్మ‌భూష‌ణ్..?

     Written by : smtv Desk | Wed, Sep 20, 2017, 03:15 PM

ధోనీకి ప‌ద్మ‌భూష‌ణ్..?

ముంబై, సెప్టెంబర్ 20: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పేరును దేశంలోనే అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుకు బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు ధోనీ పేరును కేంద్రానికి బీసీసీఐ నివేదించింది. కూల్ కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసుకున్న మహీ క్రికెట్ ఆటలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.

భార‌త జ‌ట్టుకు రెండు ప్ర‌పంచ క‌ప్‌లు (2011- వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2007- వ‌ర‌ల్డ్ టీ20) తీసుకువ‌చ్చి, 90 టెస్ట్ మ్యాచుల్లో దాదాపు 10వేల ప‌రుగులు చేసిన ధోనీ కి ఈ అవార్డును ప్రతిపాదించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధోనీకి 2007లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు వచ్చింది. అనంతరం 2009లో పద్మ శ్రీ పురస్కారంతో ధోనీని కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. కాగా, ఇదివరకే 2014లో మహి పేరును పద్మభూషణ్ అ వార్డుకు నివేదించగా చేదు అనుభవం ఎదురైంది.

Untitled Document
Advertisements