పండగ ఆఫర్ ప్రకటించిన జియో..

     Written by : smtv Desk | Wed, Sep 20, 2017, 05:47 PM

పండగ ఆఫర్ ప్రకటించిన జియో..

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20 : రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఇప్పటికే టెలికాం రంగంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న "జియో" ఇప్పుడు దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని "జియో ఫై" (JioFi) 4జీ హాట్‌స్పాట్ పరికరంపై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

ప్రస్తుతం రూ. 1999 ఉన్న "జియో ఫై" పరికరం ధరను వెయ్యి రూపాయలు తగ్గించి రూ. 999కే అందిస్తున్నట్లు ప్రకటించింది. జేబులో పెట్టుకోవడానికి వీలుగా ఉండే ఈ పరికరం 4జీ ఫోను లేకపోయినా.. 4జీ వేగంతో డేటా, కాలింగ్ సదుపాయాలు మాత్రం అందిస్తుంది. అంతేకాదు 3జీ , 2జీ స్మార్ట్ ఫోన్స్, లాప్ టాప్ లలో కూడా ఈ సేవలను పొందే వీలుంది.

అసలు ఈ "జియో ఫై" ఎలా పని చేస్తుందంటే... ప్రతీ 'జియో ఫై'తో ఒక జియో సిమ్ వస్తుంది. ఈ పరికరంలో సిమ్ వేసిన తరువాత ఇది వైఫై హాట్ స్పాట్‌గా పని చేస్తుంది. కాని ప్లే స్టోర్ నుంచి 'జియో 4జీ వాయిస్' అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిమ్ యాక్టివేట్ అవగానే జియో ఫై ద్వారా ఫ్రీ వాయిస్ కాల్ సేవలు, 4జీ డేటా సేవలను పొందవచ్చు. కాగా ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో పేర్కొంది.

Untitled Document
Advertisements