హరిత అభివృద్ధికి పాటుపడండి..విపత్తులను తరిమి కొట్టండి..!

     Written by : smtv Desk | Thu, Sep 21, 2017, 11:29 AM

హరిత అభివృద్ధికి పాటుపడండి..విపత్తులను తరిమి కొట్టండి..!

అంతర్జాతీయం సెప్టెంబర్ 21: అభివృద్దే ధ్యేయంగా ప్రపంచ దేశాలన్నీ ప్రపంచీకరణ వైపు ప్రయాణం చేస్తున్నా ..ప్రయాణం సాఫీగా సాగుతుందా..? అంటే లేదనే సమాధానమే విస్పష్టం. అభివృద్ధి మాటున దేశాలు అవలంభిస్తున్న నూతన విధానాలు పలు ప్రకృతి వైపరిత్యాలకు దారి తీస్తున్నాయి. ప్రపంచీకరణ వైపు ప్రపంచ దేశాలు పయనించాలన్న ఆలోచన ఆహ్వానించదగినదే. కానీ ఇది ప్రకృతి వైపరిత్యాలకు దారి తీయడమే ఇక్కడ విచారించవలిసిన విషయం.

ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందాలనే దిశగా వికృత పోకడలు తొక్కుతున్నా అవి పలు ప్రకృతి వైపరిత్యాలకు దారితీస్తున్నట్టు, ఇటీవల అమెరికాలో సంభవించిన హరికేన్లు, కొద్ది గంటల క్రితం మెక్సికోలో సంభవించిన భారీ భూకంపం దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పవచ్చు. అభివృద్ధి ప్రతిదేశానికి అవసరమే కాని అది ఎతగా..? ప్రకృతి వైపరిత్యాలను కొనితెచ్చుకునేంతగానా..? ప్రస్తుతం ప్రపంచ దేశాలు పయనిస్తున్న అభివృద్ధి వైపరిత్యాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అభివృద్ధి వైపరిత్యాలకు దారితీయకుండా ఉండాలంటే అనుసరించాల్సిన మార్గం ఒకటే అని వారు సూచనలు జారీ చేస్తున్నారు. ఆ మార్గమే హరిత అభివృద్ధి( గ్రీన్ డెవలప్ మెంట్) వైపు ప్రపంచ దేశాలు అడుగులు వేస్తే అది ప్రకృతి విపత్తులకు దారి తీయకుండా ఉంటుందని, పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో కరంట్ తో నడిచే వాహనాలను ప్రవేశపెట్టడం దీనికి సరైన ఉదాహరణగా చెప్పవచ్చు. ఇలా ప్రతి రంగంలో పర్యావరణానికి హాని కలగని దిశగా మార్పు తీసుకువస్తే రాబోయే కాలంలో ఎలాంటి వైపరిత్యాలను మనం చవిచూడాల్సిన పరిస్థితి తలెత్తదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

Untitled Document
Advertisements