జియో ఫోన్స్ కోసం చూస్తున్నారా.. మీకో బ్యాడ్ న్యూస్..!

     Written by : smtv Desk | Thu, Sep 21, 2017, 02:46 PM

జియో ఫోన్స్ కోసం చూస్తున్నారా.. మీకో బ్యాడ్ న్యూస్..!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21 : మీరు జియో ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారా..! అయితే మీకో బ్యాడ్ న్యూస్.. ఈ ఫోన్ల డెలివరీ తేదీని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే.. ప్రముఖ రిలయన్స్ సంస్థ నేటి నుండి జియో ఫోన్ల డెలివరీ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. కాని ముందుగా అనుకున్న ప్రకారం ఈ జియో ఫోన్లను నేటి నుండి సరఫరా చేయడం లేదు.

గత నెల ఆగస్ట్ 24 వ తేదీన ప్రీబుకింగ్స్ ప్రారంభం కాగా, మొదలు పెట్టిన గంటలోపే వినియోగదారులు భారీ ఎత్తున ఈ జియో ఫోన్లను బుక్ చేసుకోవడంతో నెట్ వర్క్ నిలిచిపోయి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రిలయన్స్ సంస్థ ప్రీబుకింగ్స్ ను నిలిపివేసింది. ఓ వైపు భారీ ఎత్తున బుకింగ్స్ రావడం.. మరోపక్క డెలివరీ డేట్స్ దగ్గర పడుతుండడంతో ఈ ప్రక్రియను అక్టోబర్ 1కి వాయిదా వేసినట్లు సమాచారం.

Untitled Document
Advertisements