ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: జేసీ

     Written by : smtv Desk | Thu, Sep 21, 2017, 02:59 PM

ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: జేసీ

అనంతపురం, సెప్టెంబర్ 21: అనంతపురం ఎంపీ. జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.." త్వరలోనే స్పీకర్ కు ఎంపీ పదవి రాజీనామా లేఖ అందిస్తానని, నగరంలో నీటి సమస్య, రోడ్ల విస్తరణ చేపట్టడంలో విఫలమయ్యానని, కొన్ని దుష్ట శక్తులు అనంతపురం అభివృద్దికి అడ్డుకుంటున్నాయని, ఎంపీగా నేను ప్రజలకు ఏమీ చేయలేదని" ప్రకటించారు.

ఈ సందర్భంగా పార్టీకి రాజీనామా చేస్తారా ? పదవికి రాజీనామా చేస్తారా ? అని అడిగిన ప్రశ్నకు...పదవికి మాత్రమే చేస్తాను, రాజకీయాలలో కొనసాగుతూనే ఉంటానని అన్నారు. అనంతపురం సమస్యలను ఉపసంహరించేదుకు రాజీనామా అస్త్రం ఉపయోగిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే విధంగా రాజీనామా చేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements