కోల్ కతా వన్డే: ఆసీస్‌ లక్ష్యం 253

     Written by : smtv Desk | Thu, Sep 21, 2017, 05:58 PM

కోల్ కతా వన్డే: ఆసీస్‌ లక్ష్యం 253

కోల్ కతా, సెప్టెంబర్ 21 : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తడబడింది. మిడిలార్డర్ ఫెయిలవడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయి.. 50 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.

భారత్‌.. 19 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ రూపంలో తొలి వికెట్‌ కోల్పోగా, అనంతరం మైదానంలోకి వచ్చిన కోహ్లీ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు.

మిడిలార్డర్‌లో మనీష్ పాండే (3), కేదార్ జాదవ్ (25), ధోనీ (5), పాండ్యా (20) విఫలమయ్యారు. కీలకమైన సమయంలో వరుసగా వికెట్లు కోల్పోవడం టీమిండియా కొంప ముంచింది.

మిగతా ఆటగాళ్లు ఎవరూ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 252 పరుగులకే కుప్పకూలింది.

Untitled Document
Advertisements