టీం ఇండియా రెండో మ్యాచ్ లోను గెలిచింది

     Written by : smtv Desk | Thu, Sep 21, 2017, 10:10 PM

టీం ఇండియా రెండో మ్యాచ్ లోను గెలిచింది

ఇండియా సెప్టెంబర్ 21: టీం ఇండియా రెండో మ్యాచ్ లోను గెలిచి తన సత్తా ఏంటో చూపించింది. ఇండియా 253 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. ఆస్ట్రేలియా 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్టోయినిస్ 62 (నాటౌట్‌), స్టీవెన్ స్మిత్ 59, ట్రావిస్ హెడ్ 39 పరుగుల చేశారు. అయితే, ఇతర బ్యాట్స్ మెన్ లలో మ్యాక్స్ వెల్ 14 మిన‌హా క‌నీసం రెండంకెల స్కోరు కూడా చేయ‌లేక‌పోయారు. కాగా, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో హిల్ట‌న్ కార్ట్‌రైట్ 1, డేవిడ్ వార్న‌ర్ 1, ట్రావిస్ హెడ్ 39, మ్యాక్స్‌వెల్ 14, మాథ్యూ వేడ్ 2, అగ‌ర్ 0, క‌మ్మిన్స్ 0, నైల్ 2, రిచ‌ర్డ్ స‌న్ 0 ప‌రుగులు చేశారు. ఆస్ట్రేలియా 202 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌల‌ర్ల‌లో కుల్‌దీప్ యాద‌వ్ 3 (హ్యాట్రిక్‌), చాహ‌ల్, భువ‌నేశ్వ‌ర్ కుమార్, హ‌ర్థిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీశారు

Untitled Document
Advertisements