కేసీఆర్ గారు.. మీకు నా అభినందనలు : రామోజీరావు

     Written by : smtv Desk | Fri, Sep 22, 2017, 06:26 PM

కేసీఆర్ గారు.. మీకు నా అభినందనలు : రామోజీరావు

హైదరాబాద్, సెప్టెంబర్ 22 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రముఖ రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు అభినందనలు తెలియజేస్తూ ఒక లేఖ రాశారు.

ఆ లేఖలో “మన తెలుగు భాషను మరింత పటిష్టపరిచే విధంగా మీరు... 1 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయ౦ హర్షింపదగినది. తొలిసారి రాష్ట్రంలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నందుకుగాను మీకు నా అభినందనలు" అంటూ పేర్కొన్నారు.


ఇలాగే ఉద్యోగ నియామక ప్రక్రియల్లో, పరిపాలన వ్యవహారాల్లో కూడా ఈ తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ఇదేవిధంగా ముందుకు సాగాలని రామోజీ రావు అభిప్రాయపడ్డారు. ఇటీవల కేసీఆర్ అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను అనివార్యం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements