అధికారులపై ఆగ్రహించిన సీఎం చంద్రబాబు...

     Written by : smtv Desk | Fri, Sep 22, 2017, 07:14 PM

అధికారులపై ఆగ్రహించిన సీఎం చంద్రబాబు...

అమరావతి, సెప్టెంబర్ 22 : విద్య, వైద్య, ఆరోగ్య రంగాల పని తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అహం వీడి స‌మ‌న్వ‌యంతో పని చేయకపోతే చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు. నాయకత్వం సరిగ్గా ఉంటే ఈ తరహా ఇబ్బందులు ఉండ‌వంటూ ఆయా శాఖ‌ల మంత్రులను పరోక్షంగా మందలించారు.

లంచాలు తీసుకునే అధికారులపై చర్యలు తీసుకోవడంలో నిర్మొహమాటంగా వ్య‌వ‌హ‌రించాలని, అప్పుడే ప్ర‌జ‌ల‌కు న్యాయం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్లు త‌మ అహంకారాన్ని ప‌క్క‌న‌బెట్టి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.





Untitled Document
Advertisements