యూట్యూబ్ లో సంచలనం రేపుతున్న ‘మెర్సల్‌’ సినిమా టీజర్

     Written by : smtv Desk | Fri, Sep 22, 2017, 10:22 PM

యూట్యూబ్ లో సంచలనం రేపుతున్న ‘మెర్సల్‌’ సినిమా టీజర్

హైదరాబాద్ సెప్టెంబర్ 22: తమిళ హీరో విజయ్, సమంత జంట గా నటించిన ‘మెర్సల్‌’ చిత్ర టీజర్‌ యూట్యూబ్ లో సంచలనం రేపుతుంది. దర్శకుడు అట్లీ పుట్టినరోజు సందర్భంగా ‘మెర్సల్‌’ టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా టీజ‌ర్ విడుదల అయిన 24 గంటల్లో 9 మిలియన్‌ వ్యూస్‌ను సాధించి రికార్డు ను నెలకొల్పింది. హాలీవుడ్ చిత్రం ‘స్టార్‌వార్‌-ది లాస్ట్‌ ఆఫ్‌ జేడీ’ టీజర్‌ లైక్స్‌ రికార్డును కూడా దాటవేసిన ఈ సినిమా టీజర్ 7,48,000 లైక్స్‌తో ‘మెర్సల్‌’ సినిమా టీజర్ ‘వివేగం’ రికార్డును కూడా తిర‌గ‌రాసింది. ఇందులో విజ‌య్ మూడు పాత్ర‌ల్లో క‌న‌ప‌డ‌నున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న‌ కాజల్‌, నిత్యా మేనన్‌, సమంత నటిస్తున్నారు. ‘మెర్సల్’ సినిమాను తెలుగులో ‘అదిరింది’ పేరు తో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ ఒక కోటి 24 లక్షల వ్యూస్ ని సాధించి నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందింది. ఈ చిత్రం వచ్చే నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Untitled Document
Advertisements