'జై లవకుశ' పై దర్శకుల ప్రశంసల జల్లు..

     Written by : smtv Desk | Sat, Sep 23, 2017, 12:11 AM

'జై లవకుశ' పై దర్శకుల ప్రశంసల జల్లు..

హైదరాబద్ సెప్టెంబర్ 23: ‘జై లవకుశ’ లో నటించిన ఎన్టీఆర్ నటన పై ప్రేక్షకులే కాకుండా టాలీవుడ్ లోని అగ్ర దర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దర్శకులు తమ తమ ట్విట్టర్ ఖాతాలో ఎన్టీఆర్ నటన గురించి స్పందిస్తూ.. ఎస్.ఎస్. రాజమౌళి ఎన్టీఆర్ నటన చూసి తనకు ఎంతో గర్వంగా ఉందని పోస్ట్ చేసారు. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు కూడా ఎన్టీఆర్ గురించి పోస్ట్ చేస్తూ, ‘నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం మా జూనియర్ తారక రాముడు. 'జై లవకుశ'లో తారక్ నటన అమోఘం. ‘జై’ ఒక అద్భుతం. ఇంకెన్నో శిఖరాలని అందుకోవాలని కోరుకుంటున్నాను’ అని తన అభిమానాన్ని ఎన్టీఆర్ పై తెలియజేసారు.

Untitled Document
Advertisements