ఒక్కపుడు దర్శకుడు ఇపుడు ప్రతినాయకుడు

     Written by : smtv Desk | Sat, Sep 23, 2017, 08:24 AM

ఒక్కపుడు దర్శకుడు ఇపుడు ప్రతినాయకుడు

హైదరాబాద్ సెప్టెంబర్ 23: ఒక్కపుడు ఇండస్ట్రీ హిట్ లు ఇచ్చిన దర్శకుడు ఈ మధ్య విలన్ గా మారారు, అయన ఎవరో కాదు ఎస్.జె. సూర్య.. తెలుగులో ఖుషి, తమిళంలో వాలి వంటి సినిమాలు తీసింది ఈయనే. కానీ ఆ తరువాత ఆ స్టాయి హిట్ లను అందుకోలేకపోయాడు. అయన మొదట్లో హీరోగా కొన్ని సినిమాలు తీశాడు, కానీ ఆ చిత్రాలు కూడా అంతగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఆ తరువాత తనలోని నటుడికి అయన పని చెప్పాడు. ఈ మధ్య తమిళంలో వచ్చిన ‘ఇరైవి’ సినిమా నటుడిగా అయన ప్రతిభను చాటి చెప్పింది. ఆ తరువాత నటన పైనే పూర్తి దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

తెలుగు చిత్రం ‘స్పైడర్’, ఇంకా తమిళ చిత్రం ‘మెర్సల్’ లలోనూ ఇపుడు ప్రతినాయకుడుగా నటిస్తున్నారు. ఇటివలే ఈ సినిమాల ప్రమోషన్ ల భాగంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై మెగాఫోన్ పట్టుకోవాలనుకోవడం లేదని, నటుడిని కావాలనే తాను ఇండస్ట్రీకి వచ్చాననీ .. కొన్ని సందర్బాలలో దర్శకుడిగా మారానని అన్నారు. దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాక నటుడిగా మారే ఛాన్స్ వచ్చిందని, అందువలన ఇప్పుడు తనలోని దర్శకుడికి విశ్రాంతినిచ్చి, నటుడిగానే ముందుకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

Untitled Document
Advertisements