రాజశేఖర్ ‘గరుడవేగ' చిత్రం టీజర్ విడుదల

     Written by : smtv Desk | Sat, Sep 23, 2017, 08:45 AM

రాజశేఖర్  ‘గరుడవేగ' చిత్రం టీజర్ విడుదల

హైదరాబాద్ సెప్టెంబర్ 23: యాంగ్రి యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న డా. రాజశేఖర్ చాలా కాలం తరువాత ‘గరుడవేగ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ చూడ్డానికి చాలా అద్భుతంగా ఉందని, అంతేకాకుండా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో చిత్రీకరించినట్టు అభిమానులు అంచనా వేస్తున్నారు. కాగా చిత్రీకరణ దాదాపుగా విదేశాల్లోనే తీశారని సమాచారం. ఈ సినిమా దర్శకుడు ‘చందమామ కథలు’ ఫేం ప్రవీణ్ సత్తారు కాగా, ఆర్కే ఫిల్మ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

అయితే ఈ చిత్ర టీజర్‌ను నటి మంచు లక్ష్మి విడుదల చేశారు. అనంతరం ఈ ప్రచార చిత్రంపై ఆమె మాట్లాడుతూ.. “ఈ చిత్రం హాలీవుడ్‌ స్థాయిలో ఉంది. చిత్ర బృంద౦ మొత్తానికి నా శుభాకాంక్షలు” అంటూ తెలిపారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న పూజా కుమార్‌, శ్రద్ధాదాస్‌, సంజయ్‌ రెడ్డితో పాటు ప్రత్యేక ఆకర్షణగా బాలీవుడ్‌ నటి సన్నీలియోన్ ఓ ప్రత్యేక గీతంలో ఆడి పాడారు. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలియజేశారు.

Untitled Document
Advertisements