జియో ఫోన్ల డెలివరీ రేపటి నుండి ప్రారంభం!

     Written by : smtv Desk | Sat, Sep 23, 2017, 09:14 AM

జియో ఫోన్ల డెలివరీ రేపటి నుండి ప్రారంభం!

న్యూఢిల్లీ : రిలయన్స్ జియో రూ.1,500 విలువగల 4జీ ఫీచర్‌ ఫోన్లను బుక్ చేసుకున్న కస్టమర్లకు ఫోన్ల డెలివరీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. గత నెల 24న ఈ ఫోన్ల బుకింగ్స్ ప్రారంభం కాగా 60 లక్షల మంది బుక్ చేసుకున్నారని, 60లక్షల ఫోన్లను వినియోగదారులకు 15 రోజుల్లో డెలివరీ చేసేందుకు రిలయన్స్ ప్రణాళికలు సిద్దం చేసినట్లు సమాచారం. తొలుత ఈ ఫోన్లను గ్రామీణ ప్రాంతాల వారికి పంపిణిని చేసిన తర్వాత పట్టణాలకు సరఫరా చేయాలని భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. జియో ఫోన్ల ప్రి–బుకింగ్‌ ఆగస్ట్‌ 24న ప్రారంభమైన విషయం తెలిసిందే. రూ.500 ప్రారంభ డిపాజిట్‌తో కస్టమర్లు వీటిని బుకింగ్‌ చేసుకున్నారు. అయితే మిగితా వేయి రూపాయలను ఫోన్ డెలివరీ అయ్యే సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులకు మూడేళ్ల తర్వాత ఫోన్‌ను కట్టినడబ్బులను మొత్తాన్ని తిరిగి ఇచ్చేవిదంగా రిలయన్స్ తన ఖాతా దారులకు వివరించిన విషయం విదితమే. ఇపుడు మనకి ఫోన్ ఫోన్, డబ్బుకి డబ్బు రావడం విశేషంగా ఉందని తమ కస్టమర్లు సంతోషంగా ఉన్నట్లు వారు వెల్లడించారు.

Untitled Document
Advertisements