సాయి ధరమ్ తేజ్.. కల నెరవేరింది!

     Written by : smtv Desk | Sat, Sep 23, 2017, 09:16 AM

సాయి ధరమ్ తేజ్.. కల నెరవేరింది!

హైదరాబద్ సెప్టెంబర్ 23: మొదటి నుంచి వీవీ వినాయక్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కల చాల సులువుగానే నెరవేరింది. ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం ప్రారంభించారు. ఆ సందర్బంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, ‘‘వినాయక్‌గారితో ఫస్ట్‌ డే షూటింగ్ లో పనిచేయడం చూస్తుంటే.. ఇది నిజమేనా అనిపిస్తోంది, కలలు నిజమవుతాయని ఇపుడు అర్థమైంది’’ అని సాయిధరమ్‌ తేజ్‌ ఆనందం వ్యక్తం చేశారు.. యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కథ అని సమాచారం. మేనమామ చిరంజీవికి రెండు హిట్‌ సినిమాలు (‘ఠాగూర్‌’, ‘ఖైదీ నెం. 150’), అలాగే చరణ్, అల్లు అర్జున్ లకు కూడా మంచి విజయాలను అందించిన వినాయక్, ఇపుడు ఈ మెగా అల్లుడికి హిట్ ఇస్తారో లేదో తెలుసుకోవాలంటే వచ్చే సంవత్సరం వరకు అభిమానులు వేచి చూడాల్సిందేమరి.

Untitled Document
Advertisements