నేడు గాయత్రీ మాతగా దుర్గమ్మ

     Written by : smtv Desk | Sat, Sep 23, 2017, 11:15 AM

నేడు గాయత్రీ మాతగా దుర్గమ్మ

విజయవాడ, సెప్టెంబర్ 23 : బెజవాడ ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కోనసాగుతున్నాయి. ఈ నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం బాలత్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మూడో రోజైన నేడు ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది), నారింజ రంగు చీరలో గాయత్రీ మాతగా కొలువుదీరిన దుర్గ మాత భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

గాయత్రీ మాతను వేదాలకు మూలంగా భావిస్తారు. నేడు దుర్గమ్మ దర్శనం సకల శుభాలకు శుభకరమని పండితులు ఉపదేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవ మూర్తుల ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఇంద్రకీలాద్రి వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

Untitled Document
Advertisements