దూసుకెళ్తున్న 'ఫిదా' సాంగ్...

     Written by : smtv Desk | Sat, Sep 23, 2017, 12:06 PM

 దూసుకెళ్తున్న 'ఫిదా' సాంగ్...

హైదరాబాద్, సెప్టెంబర్ 23: శేఖర్ కమ్ముల దర్శకత్వ౦లో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'ఫిదా', ఈ జులై 21న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూల్లు రాబట్టింది. ఇటు ఇండియాలో అటు ఓవర్సీస్ లో 50 కోట్లకు పైగా కలెక్షన్ల పర్వం కొనసాగించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో 2017లో విడుదలైన సినిమాల జాబితాలో కాసుల వర్షం కురిపించిన చిత్రాలలో 'ఫిదా' చోటు చేసుకుంది.

ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, తెలంగాణ యాసలో మాట్లాడి అందరినీ అలరించిన సాయి పల్లవి, ‘భానుమతి ఒక్కటే పీస్‌... హైబ్రిడ్‌ పిల్ల’అనే డైలాగులతో యువతను మంత్రముగ్దులను చేసింది. ఇటీవల ఈ చిత్ర బృందం అర్థశతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. అంతేకాకుండా తాజాగా ఈ చిత్రానికి వనమాలి రాసిన ‘హే పిల్లగాడా’అంటూ సాగే పూర్తి వీడియో సాంగ్‌, యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ గీతానికి కార్తీక్‌ స్వరాలు సమకూర్చగా, సింధూరి, సినోవ్‌ రాజ్‌లు ఆలపించారు. విడుదలై 24గంటల్లోపే 5లక్షల మందికి పైగా దీన్ని వీక్షించడం గమనార్హం.

Untitled Document
Advertisements