బినామీల గుట్టు చెప్తే... కోటి!

     Written by : smtv Desk | Sat, Sep 23, 2017, 12:12 PM

బినామీల గుట్టు చెప్తే... కోటి!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23 : బినామీల గుట్టు వెల్లడించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకాన్ని అమలులోకి తీసుకురానుంది. ఈ ప్రక్రియలో భాగంగా దేశ ప్రజల పూర్తి సహాయసహకారం తీసుకోవాలని కేంద్రం భావిస్తు౦డగా.. ఎవరైతే ఈ బినామీ ఆస్తుల వివరాలను తెలియజేస్తారో, వారికి ప్రభుత్వం నుండి భారీ మొత్తంలో నజరానా ప్రకటించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు సమాచారం. వారు అందించిన సమాచారం విలువను బట్టి కనిష్టంగా దాదాపు రూ. 15 లక్షల నుండి రూ. కోటి వరకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బినామీల వివరాలు తెలుసుకోవడం కష్టతరంగా ఉందని, ప్రజలకే ఈ బాధ్యతను అప్పగించి వారికి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తే, వారే ఈ కార్యక్రమాన్ని సఫలం చేస్తారని కేంద్ర౦ భావిస్తోంది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడమే కాకుండా నిందితులపై కటినంగా వ్యవహరించాలని కేంద్రం ఆలోచన. ఈ విషయంపై సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్ అధికారిని అడగగా త్వరలోనే ఈ పథకాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.Untitled Document
Advertisements