రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు

     Written by : smtv Desk | Sat, Sep 23, 2017, 01:07 PM

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్, సెప్టెంబర్ 23 : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా మహిళాలందరు బతుకమ్మ వేడుకలను కోలాహలంగా జరుపుకుంటున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ నెల 28న నిర్వహించే మహా బతుకమ్మ ఏర్పాట్లను పర్యాటక కార్యదర్శి వెంకటేశం పర్యవేక్షించగా, హైదరాబాద్ లోని కార్యాలయంలో రాష్ట్ర బవే రేజ్ కార్పోరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ తమ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

పంజాగుట్టలోని లండన్ మ్యానేజ్ మెంట్ అకాడమీలో ముస్లిం విద్యార్ధులతో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి ఆడి పాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వికారాబాద్ లో విశ్వభారతి డిగ్రీ కళాశాల, ఆదిలాబాద్ లోని నలంద డిగ్రీ కళాశాల, కరీంనగర్ వికాస్ కళాశాలల్లో విద్యార్థినులు సంప్రదాయ దుస్తులతో అలంకరించుకుని బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఇదే విధంగా ఒక్క తెలంగాణలోనే కాక విదేశాలల్లో కూడా బతుకమ్మ వేడుకలను మహిళలు సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు.

Untitled Document
Advertisements