తెలుగు యాంకర్ అడుగులు కన్నడ వైపు...

     Written by : smtv Desk | Sat, Sep 23, 2017, 01:40 PM

తెలుగు యాంకర్ అడుగులు కన్నడ వైపు...

హైదరాబాద్, సెప్టెంబర్ 23: బుల్లితెరకు యాంకర్ గా పరిచయమైన అనసూయ నటిగా మారి 'సోగ్గాడే చిన్ని నాయన', 'క్షణం' వంటి చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు పోషించింది. అంతే కాకుండా సాయిధరమ్ తేజ్ నటించిన 'విన్నర్' చిత్రంలో ఐటమ్ సాంగ్ లో నర్తించింది. ప్రస్తుతం అనసూయకు రామ్ చరణ్ నటిస్తున్న 'రంగస్థలం' సినిమాలో అవకాశం వచ్చినట్లు సమాచారం. కాని ఆమె టీ.వి. షోలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకు నో చెప్పేసిందట.

అయితే అసలు విషయం ఏంటంటే... ప్రస్తుతం ఈ భామకు కన్నడ చలనచిత్రంలో చాలా ఆఫర్లను కలిగి ఉంది. వరుసగా 6 సినిమాలను లైన్లో పెట్టేసుకుంది. తాజాగా 'సచ్చిన్ రా గోరే' అనే చిత్రంలో ఒక మహిళా ప్రాముఖ్యత ఉన్న పాత్ర పోషించనుంది. ఈ సినిమాకు సంబంధించి.. "ఈ చలన చిత్రంలో నేను మొదటిసారిగా కామెడీ చిత్రంలో నటిస్తున్నా. ఇది పరిపూర్ణ కంటెంట్ ఆధారిత నటిగా ఉందని" నటి అనసూయ చెప్పుకొచ్చింది.

Untitled Document
Advertisements