నేడు విపక్ష నేతలకు సోనియా విందు

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 11:38 AM

నేడు విపక్ష నేతలకు సోనియా విందు

న్యూడిల్లీ, మార్చి13: అధికార భాజపాకి వ్యతిరేకంగా విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ మంగళవారం రాత్రి విందుకు ఆహ్వానిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొని, అధికార భాజపాని నిలువరించడానికి బలమైన విపక్ష కూటమి అవసరమనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆర్జేడీ, వామపక్షాలతో పాటు మునుపటి యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నింటినీ సోనియా ఆహ్వానించారు. వేరే కార్యక్రమాల కారణంగా తాను ఈ భేటీకి హాజరుకాలేనని తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కాంగ్రెస్‌ వర్గాలకు సమాచారం ఇచ్చారు. ఆ పార్టీ తరఫున సుదీప్‌ బందోపాధ్యాయ హాజరవుతారు. డీఎంకే తరఫున కణిమొళి రానున్నారు. ఆర్జేడీ నుంచి లాలూప్రసాద్‌ తనయుడు తేజస్వీ యాదవ్‌ హాజరవుతారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెదేపా ఈ విందు సమావేశానికి హాజరవుతుందనే వార్తలు వెలువడినా ఆ పార్టీ వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదని స్పష్టం చేశాయి. బ్యాంకుల కుంభకోణాలు, కావేరీ జలాలు, రైతుల సమస్యలు, రాఫెల్‌ యుద్ధవిమానాల ఒప్పందం వంటి పలు అంశాలపై ఉమ్మడి పోరాటానికి వ్యూహాన్ని ఖరారుచేసే అవకాశాలున్నాయి.

Untitled Document
Advertisements